పశువులు రోడ్లపై సంచరిస్తే తరలింపు తప్పదు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్
కమీషనర్ వార్తలకు స్పందిస్తున్నారా?..అయితే అభినందనందనలు..
నెల్లూరు: నగరంలోని ప్రధాన రోడ్లమీద వాహనదారులకు అడ్డంకిగా మారిన పశువులపై వాటి యజమానులు బాధ్యత వహించకపోతే కఠిన చర్యలు తప్పవని, వాటిని గోశాలకు తరలిస్తామని నగరపాలక సంస్థ వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్ హెచ్చరించారు. పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ, కమిషనర్ సూర్యతేజల ఆదేశాల మేరకు సంచార పశువులను గోశాలకు తరలించే స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వెటర్నరీ వైద్యుని నేతృత్వంలో రెండు బృందాలు స్థానిక నవాబు పేట, పొదలకూరు రోడ్డు, కూరగాయలు మార్కెట్ ప్రాంతాల్లో రోడ్లపై సంచరిస్తున్న 11 పశువులను కల్లూరుపల్లి గోశాలకు గురువారం తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ వాహన ప్రమాదాలకు కారణమవుతున్న రోడ్లపై సంచరించే పశువులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పశువులను గోశాలకు తరలించి వాటి సంరక్షణ బాధ్యతలను నగరపాలక సంస్థ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుందని తెలిపారు. పశువులను యజమానులు వాళ్ల ప్రాంగణాలలోనే ఉంచుకోవాలని, రోడ్లపై వదిలితే తప్పనిసరిగా వాటిని గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్ ను నగర వ్యాప్తంగా ప్రతిరోజూ నిర్వహించి సంచార పశువులను తరలిస్తామని డాక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.