వ్యాపారులంతా Trade లైసెన్సులు తీసుకోండి-అదనపు కమిషనర్ నందన్
నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరికి Trade లైసెన్సులపై అవగాహన కల్పించి, తప్పనిసరిగా లైసెన్సులు తీసుకునేలా చూడాలని అదనపు కమిషనర్ నందన్ శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని శానిటేషన్ విభాగంతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యాపారానికి Trade లైసెన్స్ అందించి వాటిని ఎం.ఎస్.ఎం.ఈ సర్వేలో పొందుపరచాలని సూచించారు. కమర్షియల్ Trade లైసెన్స్ లను గుర్తించి, నోటీసులను జారీ చేసి ఫిబ్రవరి లోపు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి నెల అనంతరం అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తుంది కావున ముందుగానే Trade లైసెన్సులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.