మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారు!
అమరావతి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మంగళవారం ఏక్ నాథ్ షిండే రాజీనామా చేశారు..దీంతో మహారాష్ట్ర సీఎంగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పగ్గాలు చేపట్టే అవకాశం దాదాపుగా ఖరారు అయినట్లు కనిపిస్తోంది..డిసెంబర్ 2వ తేదీన సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం..తదుపరి ముఖ్యమంత్రి ఎన్నికయ్యే వరకూ ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని షిండేను ఆ రాష్ట్ర గవర్నర్ కోరారు..ఫడ్నవీస్‌నే సీఎం చేయాలంటూ RSS గట్టిగా కోరినట్లు సమాచారం..ఇదే సమయంలో మహాయుతిలో ఫడ్నవీస్‌ను సీఎం చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం వెల్లడించింది.. సీఎం అభ్యర్థి ఎవరంటూ ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్‌లు చర్చలు జరిపిన అనంతరం దీనిపై ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.. ఫడ్నవీస్ సీఎం అయితే ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉంది..ఈ విషయమై బీజెపీ వర్గాలు అధికారంగా వెల్లడించాల్సి వుంది.