ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుస సమావేశాల్లో బీజీగా పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధిపై..
అమారవతి: ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశం అయ్యారు..అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, గజేంద్రసింగ్ అంటే అపారమైన గౌరవం ఉందని,, జలశక్తి మంత్రిగా పోలవరం ప్రాజెక్టుకు సహకరించారన్నారు.. రాష్ట్రంలో పర్యటక రంగం అభివృద్ధిపై చర్చించారు..టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధి కేంద్ర సహకారాన్ని కోరారు.. పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని,, ఆంధ్రప్రదేశ్‌కు 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉందని,, గండికోట ఇండియన్ గ్రాండ్ కేనియన్‌లా అభివృద్ధి చేయవచ్చు అని అన్నారు.. రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం పెట్టాలని విజ్ఞప్తి చేయగా ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పవన్ కల్యాణ్ వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీలో మంగళవారం వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు..రాష్ట్రానికి రావాల్సిన నిధులు,, పెండింగ్ ప్రాజెక్టులు,,ఇతర అంశాలపై వారితో చర్చలు జరపనున్నారు.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్,,ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్,,రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో,, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో చర్చలు జరపనున్నారు..బుధవారం ఉదయం పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.