ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం-12 రాష్ట్రాలకు రూ.25 వేల కోట్ల ప్యాకెజ్
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కేబినెట్ బుధవారం ఢిల్లీలో సమావేశమైంది.. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. రూ.25 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్,,తెలంగాణ,,బిహార్,, పంజాబ్,,ఉత్తరప్రదేశ్,,కేరళ తదితర రాష్ట్రాల్లో 12 ఇండ్రస్టీయల్ పార్క్ ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది..పార్క్ ల ఏర్పాటు ద్వారా సంబంధిత రాష్ట్రాల్లో పారిశ్రామిక వృద్ధి,,ఆర్థిక అభివృద్ధి గణనీయంగా పెరుగుతుందని కేంద్రం అభిప్రాయ పడింది..ఈ కొత్త పథకం ప్రారంభం అయితే రూ.1.5 ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది..ఈ ప్రణాళికలో భాగంగా గృహ,, వాణిజ్య ప్రాంతాలతో కూడిన పారిశ్రామిక నగరాలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయ తయారీని పెంచడం, ఉపాధిని సృష్టించడం సాధ్యమని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..
అలాగే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ఖర్చుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది..పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన12,500 కోట్ల ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది..కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణంతో సహా నవంబర్ నుంచి పోలవరం పనులను వేగం పెంచేందుకు మొదటి దశ ప్యాకేజీ నిధులు కీలకం కానున్నాయి.