NATIONAL

హిందు మహాసముద్ర భద్రతలో భారత్‌ అగ్రగామిగా ఎదుగుతొంది-ప్రధాని మోదీ

అమరావతి: హిందు మహాసముద్ర భద్రతలో భారత్‌ అగ్రగామి కావాలన్న లక్ష్యసాధన దిశగా మరో ముందడుగు వేసింది..బుధవారం ముంబైలోని నేవల్‌ డాక్‌యార్డ్‌ లో భారత నావికా దళంలో అధునాతన యుద్ధనౌకలు అయిన INS సూరత్,,INS నీలగిరి,,జలాంతర్గామి INS వాఘ్‌షీర్‌ను ప్రధాని మోదీ ప్రారంభించి,,జాతికి అంకితం చేశారు.. అనంతరం నవీ ముంబయిలోని ఖర్ఘర్‌లోని శ్రీశ్రీశ్రీ రాధా మదన్‌మోహన్‌జీ ఆలయాన్ని ఇస్కాన్‌ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు..ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్‌ యుద్ధనౌకల్లో INS సూరత్‌ ఒకటి.. P15B గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ ప్రాజెక్ట్‌ కింద ఈ యుద్ధనౌకను అభివృద్ధి చేశారు..INS నీలగిరి P17A స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక.. శత్రువును ఏమార్చే స్టెల్త్‌ పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు..INS వాఘ్‌షీర్ P75 కింద రూపొందిస్తున్న 6వ, చివరి జలాంతర్గామి..దిన్ని ఫ్రాన్స్‌ కు చెందిన నేవల్‌ గ్రూప్‌ సహకారంతో అభివృద్ధి చేశారు..

భారత నౌకాదళం శక్తిని బలోపేతం చేయడానికి మూడు గొప్ప శక్తులు సిద్ధం అయ్యాయి. ఇది భారతదేశ సముద్ర సరిహద్దును అభేద్యంగా చేస్తుంది. కొత్త సంవత్సరం ప్రారంభం భారత నౌకాదళానికి చారిత్రక ఘట్టాన్ని తీసుకొచ్చింది. ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌ లో ప్రధాని మోదీ ఈ మూడు అత్యాధునాతన యుద్ధనౌకలు భారత నావికాదళానికి అందజేశారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి మరియు ఐఎన్ఎస్ వాఘ్షీర్ జలాంతర్గాములు సముద్ర గర్భంలోకి వెళ్లిపోయాయి.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ,, భారతదేశం మొత్తం ప్రపంచంలో ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌లో నమ్మకమైన,, బాధ్యతాయుతమైన భాగస్వామిగా గుర్తింపు పొందిందని అన్నారు.. భారతదేశం విస్తరణ స్ఫూర్తితో పనిచేయదని,, భారతదేశం అభివృద్ధి స్ఫూర్తితో పనిచేస్తుందని స్పష్టం చేశారు.. మూడు ప్రముఖ నౌకాదళ యుద్ధ నౌకలు భారతదేశంలోనే నిర్మించబడటం గర్వించదగ్గ విషయమన్న ప్రధాని మోదీ వెల్లడించారు.. నయా భారత్ ప్రపంచంలోనే ప్రధాన సముద్ర శక్తిగా ఎదుగుతోందని,,ఇందుకు నిదర్శనం, డిస్ట్రాయర్,,ఫ్రిగేట్,, జలాంతర్గామి కలిసి పని చేయడం ఇదే తొలిసారి అని ప్రధాని మోదీ తెలిపారు..ఈ మూడూ ఆత్మనిర్భర్ భారత్ లో భాగం కావడం దేశం గర్వించదగ్గ విషయం అన్నారు..భారతదేశ సముద్ర వారసత్వం,,నావీక దళంకు వున్న అద్భుతమైన చరిత్రకు నేడు భారతదేశం ఒక గొప్ప రోజు విరచించిందన్నారు..నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ భారత నౌకాదళానికి కొత్త బలాన్ని,, కొత్త శక్తిని అందించారని,,ప్రస్తుతం పవిత్రమైన భారతదేశ నేలపై 21వ శతాబ్దపు నౌకాదళాన్ని బలోపేతం చేసే దిశగా పెద్ద అడుగు వేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *