MOVIESNATIONALOTHERS

బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్‌పై గుర్తు తెలియని దుండ‌గ‌డు క‌త్తితో దాడి

అమరావతి: బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్‌పై ముంబైలోని అయన ఇంట్లో గుర్తు తెలియని ఓ దుండ‌గ‌డు క‌త్తితో దాడి చేశాడు..గురువారం వేకువజామున 2.30 గంటల సమయంలో అత‌నిపై దాడి జ‌రిగిందని పోలీసులు తెలిపారు.. దొంగ‌త‌నం కోసం వ‌చ్చిన వ్య‌క్తికి,, హీరో సైఫ్ అలీఖాన్‌ ఎదరు పడడంతో వీరి మధ్య తొపులట జరగడం,,చొర‌బ‌డిన వ్య‌క్తి త‌న వ‌ద్ద ఉన్న ప‌దునైన ఆయుధంతో సైఫ్ ను పొడిచినట్లు తెలిసింది..దాదాపు ఆరు చోట్ల బ‌ల‌మైన క‌త్తిపోట్లు ఉన్న‌ట్లు లీలావ‌తి ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు చెప్పారు.. రెండు చోట్ల మాత్రం ఆ క‌త్తి పోట్లు చాలా లోతుగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు..

తెల్ల‌వారుజామున 2.30 గంట‌ల‌కు ఇంట్లో దాడి జ‌ర‌గ్గా,, అత‌న్ని 3.30 నిమిషాల‌కు లీలావ‌తి ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు.. వారం క్రితం సైఫ్,అయన భార్య క‌రీనా క‌పూర్‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జ‌రుపుకునేందుకు యూరోప్‌ వెళ్లి,,తిరిగి వచ్చారు..ఒక క‌త్తిపోటు సైఫ్ వెన్నుపూస స‌మీపంలో డీప్‌గా దిగిందని,,మెడ‌, చేయి, వెన్నులో ఓ ప‌దునైన ఆయుధంతో దాడి చేసిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు..సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు..సైఫ్‌ అలీఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి దొంగ అయ్యిండచ్చని పోలీసులు ప్రాధమికంగా అనుమానిస్తున్నారు..వెన్నులో దిగిన వ‌స్తువును స‌ర్జ‌రీ ద్వారా తొల‌గించిన‌ట్లు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు..ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారని సమాచారం??..డాక్టర్లు అధికారికంగా వెల్లడించాల్సి వుంది..గతంలో సైఫ్ కు కొంత మంది వ్యక్తులతో వ్యాపార లావదేవీలకు సంబంధించి విభేదాలు వున్నట్లు తెలుస్తొంది..పోలీసుల విచారణ అనంతరం ఆసలు విషయం తెలిసే అవకాశం.?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *