శాటిలైట్లను స్పేస్ లో విజయవంతంగా డాకింగ్ చేసిన ఇస్రో
అమరావతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తాను నిర్దేశించుకున్న లక్ష్యంను సాధించింది..ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది.. డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో వర్గాలు తాజాగా వెల్లడించాయి..ISRO 2024 డిసెంబర్ 30న రాత్రి 10.15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్ పెరిమెంట్ ప్రయోగాన్ని చేపట్టింది..ఈ మిషన్‌లో భాగంగా శాస్త్రవేత్తలు PSLV-C60 ద్వారా ఛేజర్,, టార్గెట్ అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు..శాటిలైట్లను స్పేస్ డాకింగ్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది.