అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల ఇంటర్వ్యూలు వాయిదా
నెల్లూరు: నెల్లూరు డివిజన్ పరిధిలోని మండలాల్లో ఈ నెల 27-06-2026న జరగాల్సిన అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్ల నియామక ఇంటర్వ్యూలు అనివార్య కారణాల వల్ల వాయిదాపడినట్లు జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ,సాధికారిత అధికారిణి (ప్రాజెక్టు డైరెక్టర్) బి.హెన్నా సుజన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్వ్యూలకు సంబంధించిన తదుపరి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని, ఆ వివరాలను పత్రికా ప్రకటనలు-సంబంధిత అధికారుల ద్వారా అభ్యర్థులకు తెలియజేస్తామని ఆమె పేర్కొన్నారు. అభ్యర్థులందరూ ఈ మార్పును గమనించి సహకరించవలసిందిగా కోరారు.

