సోమవారం నెల్లూరు జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవు-కలెక్టర్.ఆనంద్
నెల్లూరు: సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో అధిక వర్షాలు కురిసే అవకాశం వున్న దృష్ట్యా నెల్లూరు జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు,జూనియర్ కాలేజీలకు ప్రభుత్వ శెలవు దినముగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు.