రాత్రికి కలెక్టర్ కార్యాలయంలోనే బస చేస్తున్న సీ.ఎం చంద్రబాబు
బాధితులకు తక్షణమే నీరు,ఆహారం…
అమరావతి: గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందుల పడుతున్న నగర వాసులకు దృష్టిలో వుంచుకుని, సీఎం చంద్రబాబు స్వయంగా ఆయన వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.. బాధితులకు వేగంగా సహాయం అందేలా చర్యలు చేపడుతున్నారు.. వరద ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొనే వరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేటుకు దగ్గరనే బస చేయాలని ఆయన నిర్ణయించారు..వరదల పరిస్థితిపై గంట గంటకు స్వయంగా సమీక్షిస్తానని ఆయన ప్రకటించారు..ఇది ఊహించని విపత్తు అని,,బాధితులకు తక్షణమే ఆహార సరఫరా పంపిణీ కార్యక్రమం చేపడతామని ఆయన భరోసా ఇచ్చారు..వరదలో చిక్కుకుపోయిన వారికి సహాయక చర్యలు అందిస్తున్నామని, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహార ప్యాకెట్లు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.. బోట్ల ద్వారా వరదలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువస్తున్నామని వెల్లడించారు..ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టామని, వరదలో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని, ప్రభుత్వం సకాలంలో స్పందించిందని ఆయన చెప్పారు.. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, ఉన్నత అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. తక్షణం విజయవాడ నగరంలో ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయో అన్నింటినీ కొనుగోలు చేయాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. తక్షణం వాటిని ఇంటింటికీ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. మంచి నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు చంద్రబాబు సూచన చేశారు.
రాత్రికి కలెక్టర్ కార్యాలయంలోనే బస:- విజయవాడలోని కలెక్టరేట్‌లోనే సీఎం చంద్రబాబు అదివారం రాత్రికి మకాం చేయనునున్నారు.. బుడమేరు ప్రభావిత ప్రాంతాల్లో వరద పీడిత ప్రాంతాల ప్రజానీకాన్ని ఆదుకునే వరకు అక్కడే ఉండాలని సీఎం నిర్ణయించుకున్నారు..సీ.ఎం క్షేత్రస్థాయిలో బస చేయడంతో అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులు తీస్తోంది.. వివిధ శాఖల ఉన్నతాధికారులు అందరూ వెంటనే కలెక్టరేట్‌కు రావాలని చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.