ఏ.పి,తెలంగాణలో 432 రైళ్లు రద్దు,140 రైళ్లు దారి మళ్లింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ముంచెత్తిన వరదల ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది.. భారీ వర్షాలతో ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది..అలాగే 140 రైళ్లు దారి మళ్లించగా, మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొంది.. రద్దయినవాటిలో సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు..సోమవారం ఉదయం 96 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు..భారీ వరదల కారణంగా మహబూబాబాద్ సమీపంలోని అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగింది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గం మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి..ఇంటికన్నె-కేసముద్రం మధ్య రైల్వే ట్రాక్ కంకర కొట్టుకుని పోవడంతో ఆప్,డౌన్ లైన్స్ పూర్తిగా ధ్వంసమైయ్యాయి.. దీంతో రైళ్ల రాకపోకలు యధావిధిగా కొనసాగించేందుకు రైల్వే అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు..ప్రస్తుతం 60 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి.. వాతావరణం అనుకూలిస్తే త్వరతిగతిన పనులు పూర్తిచేసి మంగళవారం నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు.