VRHS లో1050 మందికి నిరుపేదలకు మాత్రమే అవకాశం కల్పించాం-మంత్రి నారాయణ
సోమవారం ఆరో తరగతి,బుధవారం 1 నుంచి 5వ తరగతి వరకు..
నెల్లూరు: VR హైస్కూల్ లో అడ్మిషన్స్ కోసం 5000 మంది దరఖాస్తు చేసుకున్నారని,, అయితే వాటిలో 1050 మంది నిరుపేదలైనటువంటి వారికే అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు..VRC తరహాలోనే సిటీలో మరో 11 హై స్కూల్ పాఠశాలలను ఏడాది లోపు సిద్ధం చేస్తామని మునిసిపాల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు..గురువారం అయన VR హైస్కూల్ ను మంత్రి కుమారై షరిణీతో కలసి సందర్శించారు..ఈ సందర్బంలో మంత్రి మాట్లాడుతూ వీఆర్ హై స్కూల్ ప్రారంభానికి సిద్ధమైందని,, క్రీడా మైదానం ఎంతో ఆకర్షియంగా,,డిజిటల్ విద్య కోసం గదులు ల్యాబ్లు, మ్యూజిక్, డాన్స్ రూములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు..వచ్చే నాలుగేళ్లలో మిగిలిన స్కూల్స్ ని కూడా ఆధునికరిస్తామని,,భారతదేశంలోనే నెల్లూరు స్కూల్స్ ను మోడల్ గా నిలబెట్టడమే లక్ష్యమన్నారు..సోమవారం ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు క్లాసులు ప్రారంభిస్తామని,, బుధవారం ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు క్లాసులు ప్రారంభమవుతాయని,,అలాగే గురువారం రోజు నర్సరీ తరగతులు నిర్వహిస్తామన్నారు.. విధ్యాశాఖ మంత్రి లోకేష్ 6వ తేదీన హై స్కూల్ ను ప్రారంభిస్తారని తెలిపారు.
పాఠశాలను పరిశీలించిన మంత్రి తొలుత వీఆర్సి పాఠశాలలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.. ఉపాధ్యాయులకు బోధన అంశాలు పిల్లల సంరక్షణపై వారికి దిశా నిర్దేశం చేశారు.. వీఆర్సి ఉపాధ్యాయులు,,మిగిలిన ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలవాలని కోరారు..ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్,కార్పొరేషన్ కమీషనర్ నందన్,వీఆర్ హై స్కూల్ హెడ్ మాస్టర్ వెంకట్రావు, టిడిపి ముఖ్య నేతలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.