జాతీయ పసుపు కార్యకలాపాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
హైదరాబాద్: నిజామాబాద్ లో జాతీయ పసుపు కార్యకలాపాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్ పాల్లొన్నారు..ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని పసుపు కొమ్ముల దండతో ఎం.పీ అరవింద్ సత్కరించారు.. అనంతరం ఎంపీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ,,పసుపు బోర్డు ఏర్పాటుతో నా హామీ పూర్తికాలేదు,, నిజామాబాద్ కు ఇంకా చాలా పరిశ్రమలు వస్తాయని,,తాను చేయాల్సింది ఇంకా చాలా వుందన్నారు.. పసుపు బోర్డు ఏర్పాటు కేవలం రైతులకు మాత్రమే కాదు,, జిల్లా మొత్తానికి పర్యాటకంగా కూడా ఉపయోగపడుతుందన్నారు.. బోర్డు ఏర్పాటు వల్ల రైతులకు మెరుగైన ధర లభిస్తుందని,, ఎగుమతులకు, స్టోరేజ్, మార్కెటింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్ సహా అనేక రకాలుగా ఉపయోగపడుతుందని తెలిపారు.. సంక్రాంతి పర్వదినం రోజున లక్షలాది మంది పసుపు రైతుల కల నెరవేర్చిన ప్రధాని మోడీకి ధర్మపురి అరవింద్ పాదాభివందనాలు తెలిపారు.