కోల్‌కతాలో న్యాయ విద్యార్థినిపై కాలేజీలో సామూహిక అత్యాచారం
అమరావతి: కోల్‌కతాలో మరో దారుణ సంఘటన జరిగింది..దక్షణ కొల్ కత్తా నగరంలోని కస్బా పరిసరాల్లో ఓ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం బుధవారం రాత్రి 7-30 నుంచి 10-50 గంటల మధ్య కాలేజ్ క్యాంపస్‌లో జరిగింది..ఈ కేసులో ఇప్పటి వరకూ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.. యువతి గురువారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన FIR ప్రకారం, ప్రధాన నిందితులు మోనోజిత్ మిశ్రా(31), కాలేజీలో ఉద్యొగిగా పనిచేస్తున్నడు అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ (TMCP) దక్షిణ కోల్‌కతా జిల్లా మాజీ విద్యార్థి,ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు.. జైబ్ అహ్మద్(19) మొదటి సంవత్సరం విద్యార్థి, ప్రమిత్ ముఖర్జీ(20) విద్యార్థి..పరిక్షలకు సంబందించి అప్లికేషన్స్ పూర్తి చేయాలంటూ రాత్రి సమయంలో కాలేజీకి పిలిపించిన మనోజ్ మిశ్రా,తనను హింసిండాని,అతని కాళ్లు పట్టుకుని బ్రతిమాలిన కనికరించలేదని తెలిపింది.కాలేజీ మెయిన్ గేటుకు తాళం వేశారని పేర్కొంది..మనోజ్ మిశ్రా చెప్పినట్లు వినకపోతే,యువతి బాయ్ ప్రెండ్ చంపేస్తామని,,అమె కుటుంబ సభ్యులపై కేసులు పెట్టిస్తామని బెదిరించారని తెలిపింది..ఈ సంఘటనపై బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించింది..రాష్ట్రంలోని మమతా బెనర్జీ నేతృతంలోని తృణమూల్ ప్రభుత్వంపై పాలన చేపట్టిన తరువాత రాష్ట్రంలో మహిళలకు, విద్యార్థినులకు భద్రత కరవైందని ధ్వజమెత్తింది.