రేపు,ఎల్లుండి నగరంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన
నెల్లూరు: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈనెల శుక్రవారం,,శనివారం నెల్లూరులో పర్యటించనున్నారు.. 16వ తేదీ మధ్యాహ్నం 3.10 గంటలకు రాజ్ భవన్ నుంచి బయలుదేరి విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకుని రైలులో రాత్రి 7.18 గంటలకు నెల్లూరు రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అనంతరం నెల్లూరు నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం చేరుకుని రాత్రి బస చేస్తారు.17వ తేదీ ఉదయం 10.15 గంటలకు ఆర్ అండ్ బి అతిథి గృహం నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్ చేరుకుని 10.30 గంటలకు భారత ఉపరాష్ట్రపతి గారికి స్వాగతం పలుకుతారు. ఉదయం 10.35 గంటలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి వెంకటాచలంలోని అక్షర విద్యాలయానికి చేరుకుంటారు. 10.50 గంటలకు అక్షర విద్యాలయం నుంచి బయలుదేరి వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ కు చేరుకుంటారు. 10.50 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు స్వర్ణ భారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారు. మధ్యాహ్నం 2.35 గంటలకు స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.50 గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ చేరుకొని భారత ఉపరాష్ట్రపతికి వీడ్కోలు పలుకుతారు. సాయంత్రం 6 గంటలకు నెల్లూరు రైల్వే స్టేషన్ చేరుకుని విజయవాడ ప్రయాణం అవుతారు.