AP&TGCRIME

మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌‌ను తిరస్కరించిన హైకోర్టు

హైదరాబద్: మీడియాపై దాడి,, హత్యాయత్నం కేసులో సినీనటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది.. మోహన్‌బాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది..TV9 జర్నలిస్ట్‌ రంజిత్‌పై దాడి కేసులో బెయిల్ పిటిషన్‌ దాఖలు చేయగా,, దీనిపై ధర్మాసనం సోమవారం విచారించింది..మోహన్‌బాబు ఇండియాలోనే ఉన్నారని,,తన మనవరాలిని చూసేందుకు దుబాయ్ వెళ్లి తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు..

మోహన్‌బాబు నరాలు,,గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తరుపు లాయర్‌ వాదనలు వినిపించారు..దీనిపై హైకోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ,, మోహన్‌బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని కోరారు..ఇదే సమయంలో మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్ట్‌ రంజిత్ స్టేట్‌మెంట్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించారు..ఇర పక్షాలవాదనల అనంతరం బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది..ఈ నెల 24వ తేది వరకు మోహన్‌బాబు కోర్టును సమయం అడిగారని,,ఆ తరువాత విచారణ ఉంటుందని ఇటీవల రాచకొండ పోలీసు కమీషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *