ముంబై తీరంలో ఫెర్రీ వెసెల్ మునిగి 13 మంది మృతి
అమరావతి: ముంబై తీరంలో బుధవారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఫెర్రీ సముద్రంలో మునిగిపోవడంతో 13 మంది మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. మృతులలో ముగ్గురు నేవీ సిబ్బంది కూడా ఉన్నారు..101 మందిని రక్షించినట్టు అధికారులు తెలిపారు..అధికారులు తెలిపిన సంఘటన వివరాల ప్రకారం ‘గేట్‌వే ఆప్ ఇండియా’ నుంచి సుమారు 100 మంది పర్యాటకులతో ‘నీల్‌కమల్’ అనే ఫెర్రీ బయలుదేరింది.. ట్రయిల్స నిర్వహిస్తున్న నేవీ స్పీడ్ బోటు అదుపు తప్పి ఎలిఫెంట కేవ్స్ కు వెళ్తున్న ఫెర్రీని ఢీకొట్టింది.. ఫెర్రీ ఒక్కసారిగా తలకిందులై నీటమునిగి పోవడంతో హాహాకారాలు చెలరేగాయి..ఫెర్రీలోని సిబ్బంది SOS పంపించడంతో 11 నేవీ పడవలతో సహా 3 తీర ప్రాంత దళం పడవలు,, నాలుగు హెలికాప్టర్లు రంగంలోకి దిగి ప్రయాణికులను రక్షించారు..సహాయ కార్యక్రమాల్లో పోర్ట్ అధికారులు, తీరప్రాంత సిబ్బంది, మత్స్యకారులు పాల్గొన్నారు.