జమ్ముకశ్మీర్ లోని కుల్గాంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులను హతం
అమరావతి: జమ్ముకశ్మీర్ లోని కుల్గాం, బెహిబాగ్ ప్రాంతంలోని కద్దర్‌లో, భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో భద్రతా బలగాలు 5గురు ఉగ్రవాదులను హతం చేశాయి..మరో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.. టెర్రరిస్టులు నక్కి ఉన్నారన్న సమాచారంతో గురువారం వేకువజామున కూల్గాంలో కార్డన్ సెర్చింగ్ నిర్వహించారు..ఒక ప్రాంతంలో నక్కి వున్న ఉగ్రవాదులు బలగాలపై ఒక్కసారిగా ఫైరింగ్ జరిపారు.. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాల కాల్పులు జరిపి ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు..ఇంకా అక్కడ టెర్రరిస్టులు ఉన్నారనే అనుమానంతో CRPF, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు..ఈ ఆపరేషన్‌లో ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు..