గాంధీకుటుంబంలో అందరికి భారతరత్నలు,అంబేద్కర్ కు ఎందుకు ఇవ్వలేదు-కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
అలాంటివి జరుగుతుంటాయి,రాహుల్..
అమరావతి: బీఆర్ అంబేద్కర్ ను ఎన్నికల్లో రెండు సార్లు ఓడించిన కాంగ్రెస్ పార్టీ,బాబాసాహెబ్ భారతరత్నం ఎందుకు ఇవ్వలేదంటూ బీజెపీ నాయకులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు..గాంధీ కుటుంబంలోని వారంతా భారతరత్నలు అందుకున్నారని గుర్తు చేశారు..ఓట్ల రాజకీయం కోసం నేడు బీఆర్ అంబేద్కర్ కు ఆన్యాయం జరిగిందటూ బూటకపు నాటకాలు అడుతొందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గాంధీ కుటుంబన్ని విమర్శించారు.. పార్లమెంట్ ఆవరణలో అధికార, విపక్షాల పోటాపోటీ నిరసనలు చేపట్టాయి.. ఈ నేపధ్యంలో బీఆర్ అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందంటూ బీజెపీ నేతలు ప్లకార్డులతో గురువారం ఆందోళన చేపట్టారు.. హోం మంత్రి అమిత్ షా,బీ.ఆర్.అంబేద్కర్ ను అవమానించారంటూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వారు ఆరోపించారు..‘బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానిస్తే సహించేది లేదంటూ, అంబేద్కర్ తమకు దారి చూపించారు.. కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించిందంటూ బ్యానర్లు పట్టుకుని బీజేపీ ఎంపీలు పెద్ద పెట్టున,, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. పార్లమెంట్ ముఖద్వారం వద్ద బీజెపీ ఎం.పీలు నిరసనలు తెలుపుతున్న సమయంలో ఒడిషా బీజీపీ ఎం.పీ ప్రతాప చంద్ర సారంగిని అక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ నెట్టి వేయడంతో అయన పడిపోయారు..దింతో అయన కంటిపై రక్త గాయాం అయింది..ఈ విషయంపై మీడియా రాహుల్ గాంధీని ప్రశ్నించగా అలాంటివి జరుగుతుంటాయి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు..రాహుల్ ప్రవర్తను నిరససిస్తూ కేంద్ర మంత్రులు,,ఎం.పీ పార్లమెంట్ వద్ద రోడ్డుపై బైటాయించిన,,రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ నిరసనలకు దిగారు.