అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్
అమరావతి: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అస్ట్రేలియాలోని గబ్బా వేదికగా జరిగిన మూడో క్రికెట్ టెస్టు మ్యాచ్ డ్రా ముగిసింది.. మ్యాచ్ ముగిసిన వెంటనే టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.. ఇన్నాళ్లూ దేశానికి ప్రాతినిధ్యం వహించడం తన అదృష్టమని, గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పాడు..టీమ్ఇండియా అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన ఈ దిగ్గజ స్పిన్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు.’ అని BCCI తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేసింది.. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు..అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఆడాడు.. ఈ మ్యాచ్‌లో అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌ల్లో 22, రెండో ఇన్నింగ్స్ లో 7 పరుగులు చేశాడు..18 ఓవర్లు వేసి 53 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు..భారత్ తరపున అశ్విన్ 106 టెస్టులు 116 వన్డేలు, 65 టీ20 మ్యాచులు ఆడాడు..106 టెస్టుల్లో 537 వికెట్ల పాటు 3503 పరుగులు చేశాడు.. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు.. ఇక 116 వన్డేల్లో 156 వికెట్లతో పాటు 707 పరుగులు, 65 టీ20ల్లో 72 వికెట్లతో పాటు 184 పరుగులు సాధించాడు..