ప్రతి రోజుకు మనిషికి సగటున 55 లీటర్లు పరిశుభ్రమైన నీరు-డిప్యూటీ సీఎం
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతి రోజుకు మనిషికి సగటున 55 లీటర్లు పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనే సంకల్పంతో జల్‌జీవన్ మిషన్ ప్రారంభమైందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు..బుధవారం విజయవాడలో జల్‌జీవన్ మిషన్ పథకం అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను పవన్ కల్యాణ్ ప్రారంభించారు..ఈ సందర్బంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్‌ను మరింత బలోపేతం చేస్తామని ఇందుకు అందుబాటులో ఉన్న నీటి వనరులు బలోపేతం చేయడం, నిర్వహణ ముఖ్యం అన్నారు..నీటి సరఫరాలో తరచూ వచ్చే ఇబ్బందుల పరిష్కారానికి అమృతధార కింద విధివిధానాలు రూకల్పన చేస్తామన్నారు..95.44 లక్షల కుటుంబాలకు గాను 70.04 లక్షల గృహాలకు నీటి కుళాయిలు అందించబడ్డాయని ఇంకా 25.40 లక్షల నీటి కుళాయిలు ఇవ్వాల్సి ఉందని జల్ జీవన్ మిషన్ తెలియజేసిందన్నారు.. అందుకని నేను అసలు వీరు ఎన్ని ఇళ్లకు నీరు అందించారు,,ఏ స్థాయిలో నీరు వస్తున్నాయి అని పల్స్ సర్వ చేయిస్తే, 85.22 లక్షల కుటుంబాలకు గాను కేవలం 55.37 లక్షల గృహాలకే నీటి కుళాయిలు ఆందించబడ్డాయని తెలిపారు..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జల్‌జీవన్ మిషన్‌ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు..ఈ మిషన్ 2019లో ప్రారంభం అయినా గత ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదని,, గత ప్రభుత్వం ఈ పథకానికి 26 వేల కోట్లు మాత్రమే అడిగారని,, 4వేల కోట్లు మాత్రమే కేంద్రం నుంచి విడుదల అయ్యాయని అన్నారు.. ఈ పథకంలో రిజర్వాయర్స్ నుండే నీటిని తీసుకోవాల్సి వుండగా గత ప్రభుత్వం భూగర్బం నుంచి అవసరం లేకపోయినా పైపు లైన్లు, బోర్ వెల్స్ వేసి నీటిని తోడేశారన్నారని విమర్శించారు.. వచ్చిన కొద్దిపాటి నిధులనుసైతం సక్రమంగా వినియోగించలేదని,, 4వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని మండిపడ్డారు..రూ.4 వేల కోట్లు ఏం చేశారు..? ఎవరికి నీరు ఇచ్చారు? ఎక్కడికి వెళ్లినా నీటి కొరత కనిపిస్తూనే ఉందని గత ప్రభుత్వంలో పథకం అమలు తీరుపై పవన్ ప్రశ్నించారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రిజర్వాయర్ నుండే నీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని,, ఈ పథకానికి రూ.70 వేలకోట్లు నిధులు కావాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ను కోరడం జరిగిందని పవన్ కల్యాణ్ చెప్పారు.. పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లు వివరించారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకొని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామని పవన్ పేర్కొన్నారు.