రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం-కలెక్టర్ ఆనంద్
నెల్లూరు: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన దృష్ట్యా జిల్లాలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తీర ప్రాంత ప్రజలు ,పెన్నా పరీవాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళవద్దని ,బోట్లు,వలలు జాగ్రత్త పరచుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.వర్షాల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూం నెంబర్ 0861-2331261 కు తెలియ జేయవలసిందిగా కోరారు. అధికార యంత్రాంగం అంతా హెడ్ క్వార్టర్స్ లో ఉండి అల్పపీడనం భారీ వర్షాల సమయంలో తీసుకోవలసిన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.