నటి జత్వానీ కేసులో PSR ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గన్నీలు సస్పెండ్
అమరావతి: ముంబై నటి కాదంబరీ జెత్వానిపై వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది..మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గన్నీలపై సస్పెన్షన్ వేటు వేసింది..డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్ ల సస్పెన్షన్ ఫైల్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకం చేశారు..అధికార దుర్వినియోగ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. సస్పెన్షన్ కు సంబంధించిన జీవో నంబర్ 1590, 1591,1592 ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది..పబ్లిక్ డొమైన్ లో కాన్ఫిడెన్షియల్ అని ప్రభుత్వం పేర్కొంది.. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని,, శుక్రవారం, శనివారం వరుసగా రెండు రోజుల పాటు తన న్యాయవాదులు పీవీజీ ఉమేష్ చంద్ర, పాల్‌తో కలసి ఆమె విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం స్టేషన్‌కు వెళ్లారు..సీఐ చంద్రశేఖర్‌కు పలు వివరాలు ఇచ్చి ఫిర్యాదు చేశారు..ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు FIR నమోదు చేశారు.