DEVOTIONALNATIONALOTHERS

మహా కుంభ‌మేళాలో అపశృతి-తొక్కిసలాటలో 15 మంది మృతి ?

అమరావతి: మహా కుంభ‌మేళాలో దుర్ఘటన చోటుచేసుకున్న‌ది..బుధవారం మౌని అమావాస్య సంద‌ర్భంగా అమృత స్నానంలో పాల్గొనేందుకు మంగళవారం నుంచే భక్తులు ల‌క్ష‌ల సంఖ్య‌లో త్రివేణి సంగ‌మంకు చేరుకున్నారు.. బుధవారం వేకువజామున బ్రహాముహుర్తం అయిన 3 గంట‌ల స‌మ‌యంలో ఘాట్‌లోకి భక్తుల్నిఅనుమతిచ్చారు.. ఈ సమయంలో సెక్టార్-2 ప్రాంతంలో ఓచోట బారీకేడ్ తీసినప్పుడు భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకొచ్చారు..దింతో బ్యారికేడ్లు సైతం విరిగిపోయాయి..దింతో అక్క‌డ జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 15 మంది మృతిచెందినట్లు సమాచారం.. మ‌రో 100 మందికిపైగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.. ప్ర‌యాగ్‌రాజ్‌లోని స్వ‌రూప‌రాణి ఆస్ప‌త్రికి మృత‌దేహాల‌ను త‌ర‌లించి,,పోస్టు మార్టం నిర్వ‌హించ‌నున్నారు..

మ‌హాకుంభ్ ప‌రిస్థితిపై ప్ర‌ధాని నరేంద్రమోదీ,, యూపీ ముఖ్యమంత్రి యోగిఅధిథ్యనాథ్ తో సంఘటన జరిగినప్పటి నుంచి మూడు సార్లు మాట్లాడిన అక్క‌డి ప‌రిస్థితుల‌ను తెలుసుకున్నారు..కుంభ‌మేళా పరిసర ప్రాంతాల్లో ప‌రిస్థితి పై ప్ర‌ధాని మోదీ స‌మీక్షిస్తూనే ఉన్నారు.. త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌ధాని,యోగిని ఆదేశించారు.. ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌లను యూపీ ప్ర‌భుత్వ అధికారుల‌కు ప్రధాని సూచిస్తున్నట్లు సమాచారం..వేకువజామున జరిగిన తొక్కిస‌లాట కారణంగా 13 అకాడాలకు చెందిన సాధు,సంత్ లు వారి అమృత స్నానాలను తత్కాలికంగా ర‌ద్దు చేసుకున్నట్లు ప్ర‌క‌ట‌న విడుదల చేశారు..పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత అకాడాలు అమృత స్నానానికి వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయని తెలుస్తొంది..త్రివేణి సంగ‌మంలో తొక్కిస‌లాట జ‌రిగిన సంఘటన ప్రాంతానికి దాదాపు 70 అంబులెన్సులు చేరుకుని,మరణించిన వారిని గాయపడిన వారిని దాదాపు మూడు గంట‌ల పాటు అసుపత్రులకు త‌ర‌లించారు..

మౌని అమావాస్య రోజున త్రివేణి సంగమంలో అమృత స్నానం చేయాల‌న్న ఉద్దేశంతో కోట్ల సంఖ్య‌లో భ‌క్తులు ప్ర‌యాగ్‌రాజ్‌కు చేరుకున్నారు..దాదాపు 5 కోట్ల మంది భక్తులు ప్ర‌యాగ్‌రాజ్ ప‌రిస‌రాల్లో ఉన్న‌ట్లు అధికారులు అంచ‌నా వేస్తున్నారు..సాయంత్రం వ‌ర‌కు ఆ సంఖ్య మరో 4 కోట్లకు పెరిగే అవ‌కాశాలు ఉండడంతో,అధికారులు మరింత పకడ్బందిగా చర్యలు చేపట్టారు.. ప్ర‌యాగ్‌రాజ్‌ లో జరిగిన అపశృతిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,,బీజెపీ జాతీయ అధ్యక్షడు జెపీ నడ్డా,,యూపీ గవర్నర్ లు,, సీఎం యోగీ అధిత్యనాథ్ తో ప‌రిస్థితి గురించి ఎప్పటికి అప్పుడు తెలుసుకుంటున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *