సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్
అమరావతి: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.. న్యాయశాఖకు జస్టిస్ గవాయ్ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా బుదవారం సిఫారసు చేశారు.. మే 13వ తేదీతో సీజేఐ సంజీవ్ ఖన్నా పదవీ కాలం ముగియనుంది..అనంతరం 52వ సీజేఐగా జస్టిస్ గవాయ్ మే 14న బాధ్యతలు చేపడతారు..జస్టిస్ గవాయ్ సీజేఐగా 6 నెలలు కొనసాగనున్నారు.. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ మార్చి 16,1985న న్యాయవాద వృత్తిలో చేరారు..