మద్యం మత్తులో యువకులపై దాడి చేసిన గాయకుడు మనో కుమారులు
అమరావతి: సిని నేపధ్య గాయకుడు మనో కుమారులపై పోలీసు కేసు నమోదు అయింది.. చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్ (20), మదురవాయల్‌కు చెందిన ఓ 16 ఏళ్ల యువకుడు శ్రీదేవికుప్పంలోని ఫుట్‌బాల్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు..మంగళవారం రాత్రి వారు తమ ట్రైనింగ్ అయ్యాక అకాడమీ నుంచి బయటికి వచ్చి వలసర వాక్కంలో ఉన్న ఓ హోటల్‌లో డిన్నర్ చేసేందుకు వెళ్లారు..అదే సమయంలో మనో కుమారులు రఫీ, షకీర్‌లతో పాటు వారి మరో ముగ్గురు స్నేహితులు అదే హోటల్‌లో అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఈ ఐదుగురు కృపాకరన్‌తో గొడవకు దిగారు..ఈ వివాదం కాస్త గొడవగా మారడంతో మద్యం మత్తులో వున్న వీరు,, కృపాకరన్ అతని స్నేహితుడిపై దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.. ఈ గొడవలో గాయపడిన కృపాకరన్‌ను స్థానికులు కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు..సమాచారం అందుకున్న వళసరవాక్కం పోలీసులు కృపాకరన్ ఫిర్యాదుతో గాయకుడు మనో కుమారులతో సహా వారి స్నేహితులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు..దాడి చేసిన ఐదుగురిలో ఇద్దరు అరెస్టు కాగా, మనో ఇద్దరు కుమారులు, మరో స్నేహితుడు పరారీలో ఉన్నారు..వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు..అలాగే ఈ కేసులో మనో మేనేజర్, ఇంటి పని మనిషిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.