అమెరికాలో ఒక్కరోజులోనే 1,000 గోల్డ్ కార్డులు విక్రయం
అమరావతి: అమెరికా పౌరసత్వం దొరికితే చాలు అన్నట్లుగా ప్రపంచంలోని వివిధ వర్గాలకు చెందిన కుబేరులు ఎదురు చూస్తున్నారు అనేందుకు,,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశ పెట్టిన గోల్డ్ కార్డులు హట్ కేకులా అమ్ముడు పోయాయి..ప్రస్తుతం ఉన్న పెట్టుబడి వీసా EB-5 స్థానంలో గోల్డ్ కార్డు తీసుకురానున్నట్లు ఇటీవల కాలంలో ట్రంప్ వెల్లడించారు..5 మిలియన్ డాలర్లు (దాదాపు 44 కోట్లు) చెల్లించగలిగే వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని ఇవ్వనున్నారు.. కేవలం ఒక్కరోజులోనే ఏకంగా 1,000 గోల్డ్ కార్డులు విక్రయించినట్లు వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ తాజాగా వెల్లడించారు..గోల్డ్ కార్టుల అమ్మకాల ద్వారా దాదాపు 5 బిలియన్ డాలర్లు సేకరించినట్లు తెలిపారు..ప్రపంచ వ్యాప్తంగా 37 మిలియన్ల మందికి గోల్డ్ కార్డును కొనుగోలు చేయగల సామర్థ్యం ఉందని తెలిపారు..దాదాసే 10 లక్షల మంది వీటిని కొనుగోలు చేస్తారని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారని వెల్లడించారు..కార్టుల విక్రయాల ద్వారా 5 ట్రిలియన్ డాలర్లు సేకరించే అవకాశం ఉంది’ అని లుట్నిక్ పేర్కొన్నారు.