శ్రీకృష్ణదేవరాయలు పాలనలో రాయలసీమ రతనాల సీమగా వుండేది-పవన్ కళ్యాణ్
ఫాం పాండ్స్…
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల ఏకరాల్లో నీటి కుంటల నిర్మాణంలో భాగంగా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో నీటి కుంటల నిర్మాణ పనులకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం భూమి పూజ చేశారు..అనంతరం పూడిచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రధానంగా కావాల్సింది కష్టపడి పనిచేయడమే అని తెలిపారు. రాయలసీమలో నీటి కష్టాలు అధికంగా ఉండేదన్నారు..భారీ వర్షాలు పడితే నీటి నిల్వ సౌకర్యం రాయలసీమలో లేదన్నారు.. మే నెల చివరి నాటికి 1.55 లక్షల నీటి కుంటలు పూర్తి అవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.. వర్షాల సమయంలో 1.55 లక్షల నీటి కుంటలు నిండితే ఒక TMC నీళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు.. శ్రీకృష్ణదేవరాయలు పాలనలో రాయలసీమ రతనాల సీమగా వుండేదని,,తిరిగి అనాటి వైభవం రాయలసీమ సంతరించుకోవాలన్నారు..అభివృద్ధి కొందరికే పరిమితం కాదని,,అందరికీ కావాలన్నారు.. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13326 పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించామని గుర్తు చేశారు..పంచాయతీరాజ్ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు మంత్రివర్గం పరిపాలనా సంస్కరణలను ఆమోదించిందన్నారు.