ఓపెన్ సెలక్షన్లు ద్వారా జాతీయ వాలీబాల్ పోటీలకు టీంలను ఎంపిక-శాప్ చైర్మన్
అమరావతి: ఓపెన్ సెలక్షన్లు ద్వారా జాతీయ వాలీబాల్ పోటీలకు టీంలను ఎంపిక చేస్తున్నామని,,నేషనల్ టీం సమక్షంలో బాగా రాణించి రాష్ట్ర క్రీడాకారులనే జాతీయ పోటీలకు ఎంపిక చేస్తున్నామని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు..శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సెలక్షన్లు ఆంధ్రప్రదేశ్,,కర్ణాటక,,తెలంగాణ నుంచి వచ్చిన సెలక్టర్స్ పారదర్శకంగా క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారని తెలిపారు..ట్రయిల్ సెలక్షన్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారినే రాష్ట్ర వాలీబాల్ టీంలోకి ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.. జనవరి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాజస్థాన్‌లోని జైపూర్‌లో సీనియర్ నేషనల్ వాలీబాల్ టోర్నీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు..రాష్ట్రం తరపున వాలీబాల్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ప్రతిభను స్వయంగా పరిశీలిస్తున్నామన్నారు.. గత 4 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ప్రోత్సాహించక పోవడంతో రాష్ట్రంలో వాలీబాల్ క్రీడాకారులకు సరైన శిక్షణ లేకపోయిందన్నారు.. క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించేలా సీఎం చంద్రబాబు సరికొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించారని తెలిపారు.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియా పథకాల ద్వారా నిధులను తీసుకు వచ్చి,, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామని శాప్ చైర్మన్ వెల్లడించారు.