గత ప్రభుత్వంలో చాలా తప్పిదాలు జరిగాయి-చట్ట బద్దమైన విచారణ జరుగుతొంది-డీజీపీ
అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గం పర్యటన సమయంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి.. డిప్యూటివ్ సీ.ఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు.. మంగళవారం అనంతపురం పీటీసీలో 2023 బ్యాచ్ కు చెందిన డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొన్న సందర్బంలో అయన మీడియాతో మాట్లాడారు..
డిప్యూటివ్ సీ.ఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తాను ప్రత్యేకంగా వ్యాఖ్యనించను అని అన్నారు..పోలీసులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పనిచేయాలి,, మేము అలానే పని చేస్తున్నామన్నారు.. గత ప్రభుత్వంలో చాలా తప్పిదాలు జరిగాయన్నారు.. ఐజీ సంజయ్‌పై విచారణ జరుగుతోందని,,దర్యాప్తు నివేదిక వచ్చిన తరువాత మాట్లాడతామని,,వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసునైనా విచారిస్తామని స్పష్టం చేశారు..టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే భావ ప్రకటన స్వేచ్ఛా అంటూ గతంలో నీరుగార్చారని అన్నారు..నేరస్తుల వేలిముద్రలు గుర్తించే వ్యవస్థను నిర్వర్యం చేశారన్నారు..ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా అనేది పరిశీంచాల్సి వుందన్నారు..ఇటీవల సైబర్ క్రైం, సోషల్ మీడియా వేదింపులు ఎక్కువయ్యాయని,, వీటిపై పూర్తిస్థాయిలో నియంత్రించే హక్కు కోసం ప్రయత్నిస్తున్నామని డీజీపీ చెప్పారు..చట్టానికి రాజ్యాంగానికి లోబడే దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ ఇదే మా విధానం అని డీజీపీ తిరుమల రావు తెలిపారు.. రాజకీయ ఒత్తిళ్లతో మేం పని చేయం.. వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసునైనా విచారిస్తామన్నారు..ఎవరికి ఎలాంటి ప్రోటోకాల్ ఇవ్వాలో అంతే ఇవ్వాలన్నారు.. డీజీపీ ఆఫీసులో సంతకాలు చేస్తున్న వారిలో 10మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చామని,, మిగిలిన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని డీజీపీ తిరుమల రావు పేర్కొన్నారు.