వక్ఫ్ సవరణ బిల్లుల్లో 14 సవరణలకు ఆమోదం తెలిపిన జెపీసీ
అమరావతి: వక్ఫ్ సవరణ బిల్లు పరిశీలనకు ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ పలు సవరణలతో బిల్లుకు సోమవారంనాడు ఆమోదం తెలిపింది..బీజెపీ సారథ్యంలోని NDA ప్రతిపాదించిన 14 సవరణలకు ఆమోదం లభించగా ఇదే సమయంలో విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణకు గురయ్యారు.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశానంతరం కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ సదరు వివరాలను వెల్లడించారు.. మొత్తం 44 సవరణలు ప్రతిపాదలను రాగా, సభ్యులందరిని సవరణలు సూచించాల్సిందిగా కోరాడం జరిగిందన్నారు.. 6 నెలల పాటు సమగ్ర చర్చలు జరిపిన అనంతరం మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రాతిపదికగా 14 సవరణలను కమిటీ ఆమోదించిందన్నారు.. విపక్షాలు సూచించిన ప్రతి సవరణను ఓటింగ్‌కు పెట్టడడం జరిగిందని,, అయితే వారు సూచించిన సవరణలను సమర్ధిస్తూ 10 ఓట్లు, వ్యతిరేకిస్తూ 16 ఓట్లు వచ్చాయని జగదాంబిక పాల్ తెలిపారు.. వక్ఫ్ చట్టం-1995లో పలు మార్పులు తీసుకు వస్తూ కేంద్రం 2024 ఆగస్టులో బిల్లు తీసుకువచ్చింది.. అనంతరం బిల్లు పరిశీలనను 21 మంది సభ్యులతో కూడిన జేపీసీకి అప్పగించింది.