అమెరికాలో 90 అడుగుల ఎతైన హనుమాన్ విగ్రహాం ఆవిష్కరణ
అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువులు సంఘటితమై తన సంస్కృతి,సంప్రదాయాలను ఇతర సంస్కృతులను అచరిస్తున్న వారికి తెలియచేసే దిశగా అడుగులు వేస్తున్నారు..ఈ కొవలోనే…అమెరికాలోని టెక్సాస్ పరిధిలోని హూస్టన్ సమీపంలో 90 అడుగుల ఎతైన హనుమాన్ విగ్రహాన్ని హిందు బంధువులు ఏర్పాటు చేశారు.. 90 అడుగుల ఎత్తైన ఆ విగ్రహం,, అమెరికా ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రపంచంలో ఒక కొత్త మలువు అవుతుందని నిర్వహకులు పేర్కొన్నారు.. హూస్టన్‌లో ఉన్న ఈ విగ్రహం… ఎన్నో మైళ్ల దూరం నుంచి కనిపిస్తున్నది.. అమెరికాలో ఉన్న మూడవ అతిపెద్ద విగ్రహంగా రికార్డు నెలకొల్పింది..స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ(151 అడుగులు), ఫ్లోరిడాలోని హల్లండేలా బీచ్‌లో పెగాసస్-డ్రాగన్(110 అడుగులు) విగ్రహం తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.. సుగర్ ల్యాండ్‌లో ఉన్న అష్టలక్ష్మీ ఆలయంలో హనుమాన్ విగ్రహాన్ని ఆగష్టు 15 నుంచి 18 వరకు జరిగిన ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో ఆవిష్కరించారు… శ్రీ చిన్న జీయర్ స్వామిజీ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.. ఈ విగ్రహానికి “ది స్టాట్యూ ఆఫ్ యూనియన్”గా పేరు పెట్టారు.
जय हनुमान जी Big hanuman murti in Texas USA 🇺🇸 🚩🚩
— विजय 🇮🇳 (@bijjuu11) August 21, 2024