సిని నటీ కస్తూరీ అరెస్ట్? చెన్నైకి తరలింపు
అమరావతి: తమిళ నటి కస్తూరిని చెన్నై పోలీసులు, సైబరాబాద్ పోలీసుల సాయంతో కస్తూరిని, హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆమెను శనివారం అదుపులోకి తీసుకున్నట్లు విశ్వనీయ సమాచారం.. ఇటీవల హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న సందర్బంలో ఆమె, తెలుగు వారి మీద అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు..దింతో అమెపైన పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో భయపడిన కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు..ఆమెను అదుపులోకి తీసుకున్న తమిళ పోలీసులు కస్తూరిని గచ్చిబౌలి నుంచి చెన్నైకి తరలిస్తున్నట్లు తెలుస్తోంది..
తెలుగు వారిపై కస్తూరి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. తమిళనాడు పాలిటిక్స్ లో చక్రం తిప్పుతున్న కొందరు అంటూ డి.ఎం.కె వాళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎప్పుడో దశాబ్దాల కింద రాణుల దగ్గర సేవలు చేసేందుకు వచ్చి ఇక్కడ స్థిరపడి తమిళులుగా చలామణి అవుతున్నారన్నారు.. అంతఃపురంలో రాణుల దగ్గర ఊడిగం చేసేందుకు వచ్చిన వారు ఇక్కడే ఉండిపోయారు అనే అర్థం వచ్చేలా ఆమె చేసిన వ్యాఖ్యలు అటు చెన్నైతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారాయి.. తెలుగు సంఘాలతో పాటు పలువురు ప్రముఖులు, ప్రజల నుంచి కూడా తీవ్రస్థాయిలో నిరసన పెల్లుబికింది..