36 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది-రవాణ ధరలు-కలెక్టర్
నెల్లూరు: ప్రజలకు ఇసుక రవాణా భారం తగ్గించడానికి ఇసుక రవాణా ధరలు నిర్ధారించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు. గురువారం ట్రాన్స్పోర్టర్లు, రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం మన జిల్లాలో మర్రిపాడు సాండ్ డిపో పని చేస్తున్నదని, దీనిలో 36 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని ఇక్కడి నుండి రోజుకు వెయ్యి టన్నులు ఇసుక సరఫరా అవుతున్నదన్నారు. స్టాక్ పాయింట్ దూరంగా ఉండటం వల్ల, ధర ఎక్కువగా ఉందని ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. దీనిపై డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ద్వారా ఇసుక (సీలింగ్ రేట్) రవాణా చార్జీలను ఫిక్స్ చేయడం జరిగిందన్నారు. ఈ రేట్లకు ట్రాన్స్పోర్టర్లు కూడా అంగీకరించారని కలెక్టర్ తెలిపారు. ఇసుకకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 0861-2943569గాని,dmgonelloresandcomplints@gmail.com కు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. స్టాక్ యార్డ్ వద్ద టన్ను ఇసుక ధర రూ.370/- గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
మర్రిపాడు తాసిల్దార్ కార్యాలయం వద్ద బుకింగ్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ ఒక ఉద్యోగిని నియమించడం జరిగిందని అన్నారు. ఇసుక రవాణా చేసే వాహనాలను మైన్స్ శాఖ ద్వారా ఎంప్యానల్ చేయడం జరిగిందని ఇసుక కావలసినవారు అందుబాటులో ఉన్న ఎంప్యానల్డ్ వాహనాలను బుక్ చేసుకుని గాని,సొంత వాహనాలద్వార గాని ఇసుక తీసుకు వెళ్ళవచ్చు అన్నారు. ఇసుక సరఫరా ,అధిక రేట్లు వసూలు చేసిన,రవాణాలో అక్రమాలకు పాల్పడి నట్లయితే సెబ్,పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని కలెక్టర్ వెల్లడించారు.
పది టన్నుల కెపాసిటీ కలిగిన ఆరు టైర్ల లారీకి:- 0-5 కి. మీ.లకు రూ.1500/,,6-15 km లకు,2 000,,16-30 km లకు 3500/,,31-45 km లకు4500/,,46-60 km లకు5500/,, 60 km ల కంటే ఎక్కువ దూరం ఉంటె ప్రతి టన్ను కు,km కు 9 రూపాయల చొప్పున నిర్ధారించడం జరిగిందన్నారు..
18 టన్నుల కెపాసిటీ కలిగిన పది టైర్ల లారీకి:- 0-5 km లకు 2000/,,6-15 km లకు3000/,,16-30 km లకు 5000/,,31-45km లకు 7500/,,46-60 km లకు 8500/,,60 km ల పైన ఉంటే ప్రతి టన్నుకు,km కు రూ 7.50 నిర్ధారించారన్నారు.
21 టన్నుల సామర్థ్యం కలిగిన 12 టైర్ల లారీకి:- 0-5 km ల కు 2500/,,6-15 km లకు 4000/,,16-30 km లకు 6000/,,31-45 km లకు 8000/,,46-60 km లకు 10000/,,అదనపు km లకు టన్నుకు, km. కు రూ.7.50 గా నిర్ధారించారు..
4 టన్నుల సామర్థ్యం కలిగిన ట్రాక్టరు ట్రాలీకి:- 0-5 km లకు 800/,,6-15 km లకు 1500/,,16-30 km లకు 2400/,,31-45 km లకు 3000/,,46-60 km లకు 3500/,,అదనపు km కు టన్నుకు km రూ.12 గా నిర్ధారించడం జరిగిందన్నారు.