180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నభారత్ స్లీపర్ ట్రెయిన్
అమరావతి: రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి..2019లో ప్రారంభించిన వందే భారత్ సిట్టింగ్ రైలుకు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తొంది..ఈ క్రమంలో రైల్వేశాఖ స్లీపర్ తరగతి వర్షన్ అందుబాటులోకి తెచ్చింది..ఈ రైలుకు ట్రయల్ రన్స్ చేపడుతున్న రైల్వేశాఖ,, రైలు వేగాన్ని పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు..ఇందులో బాగంగా రాజస్థాన్‌లోని కోటా రైల్వే డివిజన్‌లో వందే భారత్ స్లీపర్ రైలుకు పరీక్షలు నిర్వహించారు.. ఈ పరీక్షల్లో రైలు గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది..ఇందుకు సంబంధించిన వీడియోని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు..
వందే భారత్ స్లీపర్ రైలుల్లో విలాసవంతమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు..ఈ రైలు గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల,, స్లీపర్ రైలులో ఒకేసారి 823 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది..1 ఫస్ట్ ఏసీ కోచ్, 4 సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి.. రైలులో ఫైర్ సేఫ్టీతో పాటు ప్రతి బెర్త్ వద్ద అత్యవసర స్టాప్ బటన్స్ ఉంటాయి.. ప్రయాణికులు సౌకర్యవంతంగా అప్పర్ బెర్తులు ఎక్కేలా మెట్లు ఏర్పాటు చేశారు..బయో వాక్యూమ్ టాయిలెట్లు,,టచ్ ఫ్రీ ఫిట్టింగ్‌లు,,షవర్ క్యూబికల్స్,, ఆటోమేటిక్ డోర్లు,, జీపీఎస్ ఆధారిత డిస్‌ప్లేలు,, ఛార్జింగ్ సాకెట్లు,, టాయిలెట్‌లో ఎలాంటి బటన్ నొక్కకుండానే నీళ్లు వచ్చే ఏర్పాట్లు చేశారు..ఒక కోచ్ నుంచి మరో కోచ్‌లోకి వెళ్లేందుకు ఆటో మేటిక్ డోర్లు ఏర్పాటు చేశారు..ప్రతి కోచ్‌లోనూ సీసీ కెమెరాలు ఉంటాయి..బెర్త్ వద్ద చిన్న లైట్ ఏర్పాటుతో ఎవరైనా బుక్‌లు, పేపర్ చదువుకునేందుకు అవకాశం ఉంటుంది.. సేఫ్టీ “కవచ్” సిస్టమ్,, బ్లాట్ ప్రూఫ్ బ్యాటరీ,, 3 గంటల ఎమర్జెన్సీ బ్యాకప్ ప్రయాణీకుల భద్రతను అందిస్తాయని రైల్వేశాఖ పేర్కొంది.
https://x.com/AshwiniVaishnaw/status/1874891986773426548