జమిలీ ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
అమరావతి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, దేశంలో ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికను కేబినెట్ ఆమోదించింది.. రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్టవ్ వెల్లడించారు.. దేశంలోని పెద్ద సంఖ్యలో రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలియ చేశారు.. ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయా పార్టీల నేతలు మరోసారి తమ అభిప్రాయాలు తెలియచేస్తారని పేర్కొన్నారు..జమిలి ఎన్నికలు దేశ ఆర్దిక వ్యవస్థను,,పాలనను బలోపేతం చేసే అంశంగా అభివర్ణించారు.. జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.