బంగ్లాదేశ్ లో ఎమర్జన్సీ లేక జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని పాలన?
అమరావతి: భారతదేశంను ఇబ్బంది పెట్టేందుకు అమెరికా మాజీ అధ్యక్షడు అడిన చదరంగంలో బాగంగా షేక్.హసీనాను దేశం నుంచి తరిమివేయడం,,బంగ్లాదేశంలోని మైనార్టీలను హింసించేందుకు దిగుమతి చేసిన మహమ్మద్ యూనస్ గత సంవత్సరం అక్డోబరులో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా చేపట్టాడు..యూనస్ దేశ ప్రత్యేక సలహాదారుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత బంగ్లాదేశ్ లో కరుడు కట్టిన మతత్వశక్తులు పేట్రేగి పోవడంతో,, మైనార్టీలు అయిన హిందువుల పరిస్థితి దారుణంగా మారింది..తదనతరం జరిగిన పరిమాణాల నేపధ్యంలో అమెరికా అధ్యక్షడిగా ట్రంప్ బాధ్యతల చేపడడంతో,,బంగ్లాదేశ్ లో పరిస్థితులు మారుతు వస్తున్నాయి..ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తేలా కనిపిస్తోంది..అక్కడ త్వరలో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పరిస్థితులు కన్పిస్తున్నాయి..బంగ్లాదేశ్ ప్రజల్లో ప్రభుత్వం పట్ల అపనమ్మకం ఏర్పడినట్లు స్థానిక మీడియా పేర్కొంది..ఈ నేపథ్యంలో బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ నేతృత్వంలోని సైన్యం సోమవారం అత్యవసరంగా సమావేశమైంది.. ఈ సమావేశానికి 5 మంది లెఫ్టినెంట్ జనరల్స్,, 8 మంది మేజర్ జనరల్స్,, ఇండిపెండెంట్ బ్రిగేడ్ కమాండింగ్ అధికారులు, పలువురు ఆర్మీ అధికారులు హాజరయ్యారు.. రాబోయే రోజుల్లో జరిగే ప్రధాన పరిణామాలపై చర్చించినట్లు సమాచారం..దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం లేదా యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది..సైన్యం తన పర్యవేక్షణలో జాతీయ ఐక్యత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉన్నట్లు మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.