స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా కక్షలోకి ప్రవేశించిన GSAT-20
అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అత్యాధునిక సమాచార ఉపగ్రహం GSAT-20 విజయవంతంగా నింగిలోకి చేరుకుంది.. అమెరికా ఫోరిడాలోని కేప్ కెనవెరాల్ ప్రయోగ కేంద్రం నుంచి ఎలాన్ మాస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్,,34 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది..కొద్ది రోజుల్లో కర్ణాటలోని హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకుంటుంది..వాణిజ్య పరంగా స్పేస్‌ఎక్స్,, ఇస్రో మధ్య ఇదే తొలి ప్రయోగం..ఇస్రో వద్ద ఉన్న బాహుబలి రాకెట్లు 4000 కేజీలు బరువు వున్న ఉపగ్రహాలను తీసుకుని వెళ్లగలవు..అయితే నేడు ప్రయోగించిన GSAT-20 బరువు 4,700 కిలోలు వుంది..మన రాకెట్లు ఈ ఉపగ్రహాంను తీసుకుని వెళ్లలేవు..దింతో ఇస్రో,, టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ సహకారం తీసుకున్నది.. GSAT-20 ఉపగ్రహాం 14 సంవత్సరాలు పాటు సేవలు అందించనున్నది.. అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌తో పాటు భారత్ మొత్తాన్ని కవర్ చేసి బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది..అలాగే విమానాల్లో వై-ఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి..ఆధునిక K బ్యాండ్ ఫ్రీక్వెన్సీని మాత్రమే ఉపయోగించే ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించడం ఇదే మొదటిసారి.. భూకేంద్రంలోని మౌలికసౌకర్యాలు శాటిలైట్‌తో అనుసంధానం కానుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ అన్నారు..బెంగళూరులోని యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ నుంచి ప్రయోగాన్ని ఆయన పర్యవేక్షించారు..అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ, ఖచ్చితమైన కక్ష్యలోకి ఉపగ్రహం చేరడంతో ప్రయోగం విజయవంతమైందన్నారు.