అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల-జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నెల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా జిల్లా అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు విపత్తుల నిర్వహణ సంస్థ సెప్టెంబర్ మూడవ తేదీ వరకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన చేసిన దృష్ట్యా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.వర్షాల వల్ల ఎక్కడైనా సమస్యలు ఎదురైతే తక్షణ సహాయం కోసం ప్రజలు కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 0861-2331261 /1077 కు తెలియజేయాలన్నారు. కలెక్టరేట్లో 24 గంటలు మూడు షిఫ్టులలో సిబ్బంది విధులు కేటాయించామన్నారు. జిల్లా అధికారులు కార్యాలయాల్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని జిల్లాలో ఎక్కడైనా వర్షాల వల్ల పంటలు, ఇతర నష్టాలు కాని సంభవించినట్లయితే ప్రతిరోజు కలెక్టరేట్ కు నివేదికలు పంపాలని కలెక్టర్ తెలిపారు.