విజయవాడలో ఒక్కరోజే 29 సెం.మీ.వర్షపాతం-5 గురు మృతి
అమరావతి: రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ చెరువును తలపిస్తొంది.. శనివారం రాత్రి నుంచి రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.. 30 సంవత్సరాల్లో తరువాత ఒక్కరోజే 29 సెం.మీ. వర్షపాతం కురిసింది..భారీ వర్షాలతో సింగ్‌నగర్, పైపుల రోడ్డు, సుందరయ్య నగర్, కండ్రిగ, రాజీవ్‌నగర్ తదితర ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి..ఆటో నగర్ నుంచి బెంజి సర్కిల్ వరకు, విజయవాడ శివారు కండ్రిగ దగ్గర రహదారిపై భారీగా వరద ప్రవహిస్తుండడంతో విజయవాడ, నూజివీడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి..భారీ వర్షాలకు ఇంద్రకీలాద్రి దగ్గర కొండచరియలు విరిగిపడుతున్న సందర్బంలో NH16 హైవేను మూసివేశారు.. పడుతున్నారు.విజయవాడలోని మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.. ఈ నేపథ్యంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని మంత్రి నారాయణ ఆదివారం ఉదయం పరిశీలించారు..ప్రమాదంలో ఐదుగురు మృతి చెందడం బాధాకరమని మంత్రి నారాయణ విచారం వ్యక్తంచేశారు.. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అలాగే ప్రమాదాల నివారణకు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు.
తీరందాటిన వాయుగుండం:- కళింగపట్నం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో వాయుగుండం తీరందాటింది..దీని ప్రభావంతో ఆదివారం పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూల్ జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద నిలిచిన వాహానాలు:- ఏపీ-తెలంగాణ సరిహద్దు రామాపురం వద్ద చిమిర్యాల వాగు ఉద్ధృతి ప్రవహిస్తుండడంతో ఏపీ-తెలంగాణ మధ్య వాహనాల రాకపోకలు నిలచిపోయాయి..కోదాడ వద్ద పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తొంది..అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు కీలోమీటర్ల మేర భారీగా నిలిచిపోయాయి.
పలు రైళ్లు రద్దు,దారి మళ్లీంపు:- భారీ వర్షాల ధాటికి దాదాపు 30 రైళ్లు రద్దు కాగా మరో 25 రైళ్లను రైల్వేశాఖ దారి మళ్లీంచింది..దింతో విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. హైదరాబాద్‌కు వెళ్లే రైళ్ల రద్దుతో ప్రయాణికులు గంటల తరబడి స్టేషన్లో అవస్థలు పడుతున్నారు..నల్గొండ మీదుగా హైదరాబాద్ వెళ్లేలా ప్రత్యేక రైళ్లు నడపాలని డిమాండ్ చేశారు.. విజయవాడ రాయనపాడు రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్ పైకి వరద నీరు చేరడంతో అధికారులు హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్ ప్రెస్,, హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే చార్మినార్ ఎక్స్ ప్రెస్ నిలిపివేశారు..ఈ రైళ్లలో ప్రయాణిస్తున్న వారిని 50 బస్సుల్లో తరలించారు.. వారిని విజయవాడ స్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి విశాఖ, చెన్నైకి ప్రత్యేక రైళ్లలో పంపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.