పార్లమెంట్ సభ్యుల జీతాలు, డైలీ అలవెన్సెస్,పెన్షన్ పెంచిన కేంద్ర ప్రభుత్వం
అమరావతి: పార్లమెంట్ సభ్యుల జీతాలు, డైలీ అలవెన్సెస్,పెన్షన్, అదనపు పెన్షన్‌లను కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుల జీతం లక్ష రూపాయలుగా ఉంది..దాన్ని రూ.1.24 వేలకు పెంచింది.. డైలీ అలవెన్సెస్‌ను 2వేల నుంచి 2,500లకు పెంచింది..ప్రస్తుతం పెన్షన్ మాజీ సభ్యులకు ప్రతీ నెల 25 వేల పెన్షన్ అందుతోంది..దాన్ని 25 వేలనుంచి 31 వేలకు పెంచింది.. మాజీ సభ్యుల అదనపు పెన్షన్‌లోనూ మార్పులు చేస్తూ దాన్ని 2 వేల నుంచి 2,500లకు పెంచింది..ఈ పెంపు ఏప్రిల్ 1, 2023నుంచి వర్తిస్తుంది..1954 పార్లమెంటు సభ్యుల జీతం, భత్యాలు,పెన్షన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ సవరణ జరిగింది..అలాగే ఇన్ కమ్ ట్యాక్స్ చట్టం, 1961లోని వ్యయ ద్రవ్యోల్బణ నిబంధనలకు అనుగుణంగా సవరించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.