AP&TGDEVOTIONALDISTRICTSOTHERS

శ్రీవారి భక్తులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు– టిటిడి ఛైర్మ‌న్

తిరుమ‌ల‌: శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు..స్వామి వారి దయ, ఆశీస్సులతో ప్రపంచంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్న‌ట్లు టిటిడి ఛైర్మ‌న్  బీఆర్ నాయుడు చెప్పారు..సోమవారం సమావేశం అయిన టిటిడి బోర్డు ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం జ‌రిగిందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో ముంతాజ్ హోటల్స్‌ కు ఇచ్చిన భూ కేటాయింపులను రద్దు చేస్తున్న‌ట్లు తెలిపారు..⁠ ⁠భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పరిధిలోని శ్రీవారి ఏడు కొండలకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి వ్యాపార కార్య‌క‌లాపాలు చేపట్టకుండా నిర్ధిష్ట‌మైన‌ కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు..ఇప్పటికే ఏడు కొండల ఆనుకుని వున్న భూముల్లో వ్యాపార కార్య‌క‌లాపాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ విభాగాలకు చెందిన భూములను టిటిడి స్వాధీనం చేసుకుని, వాటికి ప్రత్యామ్నాయంగా చూప‌డానికి, ఈ అంశంపై త‌దుప‌రి చ‌ర్య‌ల కొర‌కు ప్ర‌భుత్వానికి నివేధిస్తామన్నారు..

⁠భవిష్యత్ లో శ్రీవారి ఏడు కొండలకు ఆనుకుని వున్న భూములలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే జరిగేలా ధార్మిక చట్టాల్లో సవరణలు తీసుకొస్తామని తెలిపారు.. ⁠టిటిడిలో విధులు నిర్వహించే ఉద్యోగులు అందరూ హిందూ ధర్మానుసారం మాత్రమే ఉండేలా చర్యలు చేపడుతున్నమని,, ప్రస్తుతం విధుల్లో ఉన్న ఇతర మతస్థులను వారి హోదాకు తగినట్లుగా, వారి మనోభావాలకు భంగం కలగకుండా వివిధ ప్రత్యామ్నాయ పద్దతుల ద్వారా వారిని బదిలీ లేదా విఆర్ఎస్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు..అలాగే టీటీడీ తీసుకున్న పలు నిర్ణయాలను అయన వెల్లడించారు..ఈ స‌మావేశంలో టిటిడి ఈవో  జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో సిహెచ్ వెంక‌య్య చౌద‌రి, జెఈవో వీర‌బ్ర‌హ్మం, ప‌లువురు బోర్డు స‌భ్యులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *