దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనతో మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరిశిక్షే సరైనదని, తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని మరోసారి స్పష్టమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యనించారు..12 సంవత్సరాలుగా ఓ పీడకలలా వెంటాడుతున్న బాధితుల కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందని భావిస్తున్నాం అని అన్నారు..బాధిత కుటుంబాలకు మేము అండగా ఉంటామని తెలిపారు..ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించడం పట్ల బీజేపీ పార్టీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం.. ప్రజాస్వామ్యంలో బుజ్జగింపు రాజకీయాలు ఏ మాత్రం ప్రోత్సహించకూడదు.. దీన్ని అన్ని రాజకీయపార్టీలు దీన్ని గుర్తుంచుకోవాలన్నారు..జాతీయ దర్యాప్తు సంస్థ సమగ్ర విచారణ చేసి, నిందితులను శిక్షించడంలో కీలకపాత్ర వహించిందని,,ఈ పేలుళ్ళ సంఘటన దర్యాప్తు చేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలియచేస్తున్నాను అని అన్నారు.. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు జీరో టోలెరెన్స్ విధానంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని,,గత 11 సంవత్సరాలుగా బీజేపీ పాలనలో ఇలాంటి ఘటనలకు తావు లేదన్నారు..కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చిందని,, ఉగ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించే దిశగా మోదీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు.
2013 ఇండియన్ ముజాహిద్దీన్:- అనే ఉగ్రవాద సంస్థ,హైదరాబాద్ లోని దిల్ షుక్ నగర్ వద్ద జంట బాంబుల పేళ్లకు పాల్పపడ్దారు..ఈ ఘటనలో 18 మంది మరణించగా,దాదాపు 100కి తీవ్ర గాయాలు అయ్యాయి..అప్పటి ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ నిర్వహించేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది..అయితే సంఘటన తీవ్రత దృష్ట్య NIA రంగంలోకి దిగింది..ఈ సంఘటనకు పాల్పపడిన 5 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది..వీరికి NIA కోర్టు 2018లో ఉరిశిక్షను ఖరారు చేసింది..అయితే ఈ ఉగ్రవాదులు తీర్పుపై హైకోర్టును ఆక్రయించారు..ఇన్ని సంవత్సరాల తరువాత NIA కోర్టు ఖరారు చేసిన ఉరిశిక్ష సరైందనే అంటూ హైకోర్టు ఉగ్రవాదు అప్పీల్ ను కొట్టి వేస్తూ మంగళవారం తీర్పును వెలువర్చింది..ఈ తీర్పుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై విధంగా స్పందించారు.