NATIONALOTHERSTECHNOLOGY

శత్రువులకు వణుకు పుట్టించే బియాండ్ విజువల్ రేంజ్ “అస్త్ర” క్షిపణి పరీక్ష విజయవంతం

అమరావతి: భారత వాయుసేన అమ్ములపొదిలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన బియాండ్ విజువల్ రేంజ్ లక్ష్యాలను ఛేధించే “అస్త్ర” క్షిపణిని DRDO విజయవంతంగా పరీక్షించింది..గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల ఈ అస్త్రాన్ని సుఖోయ్-30 MKI యుద్ధ విమానంతో ఒడిశా తీరంలో ప్రయోగించారు..రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO), భారత వాయుసేనల ఆధ్వర్యంలో అస్త్ర క్షిపణిని పరీక్షించారు.. అస్త్ర క్షిపణి 100 కిలోమీటర్లకు మించిన లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది..ఇందులో అధునాతన గైడెన్స్, నేవిగేషన్ వ్యవస్థలు అమర్చారు..పరీక్ష సమయంలో రెండు క్షిపణులను ప్రయోగించగా ఆస్త్ర క్షిపణి రెండుసార్లు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ధ్వంసం చేసింది..అస్త్ర క్షిపణిలో స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ (RF) సీకర్‌ ఉన్నట్లు రక్షణ శాఖ తెలిపింది..నిర్వహించిన రెండు పరీక్షలు,, విభిన్న ఎత్తుల్లోని డ్రోన్లను లక్ష్యాలుగా చేసుకున్నట్లు వివరించింది..ఈ పరీక్షల్లో అన్ని వ్యవస్థలూ అంచనాలకు తగ్గట్టు పనిచేశాయని DRDO తెలిపింది..అస్త్ర పరీక్ష విజయవంతం కావడం పట్ల DRDO,,IAFను రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ అభినందించారు.

 

 

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *