పాత ప్రభుత్వాల విధానాలు భారతదేశ వృద్ధిని అణచివేశాయి-ప్రధాని నరేంద్ర మోదీ
భారతదేశ పురోగతికి ప్రపంచమే సాక్షి..
కాలం చెల్లిన విధానాలు దేశాభివృద్ధిని కుంటుపరిచాయి..
అమరావతి: భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని,, అంతే వేగంతో పేదరికాన్ని కూడా జయించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఫిక్కీ (FICCI) వార్షిక సమావేశంలో ప్రసంగిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం మరింత అభివృద్ధి చెందడానికి అవసరమైన సంస్కరణలను నిస్సందేహంగా తెలియచేయాల్సిందే అని కార్పొరేట్ సంస్థలను కోరారు. గత ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో విఫలమైందని ఆయన విమర్శించారు.
భారతదేశం ఒకప్పుడు బలహీనమైన ఐదు దేశాల సరసన ఉండేదని,, గత 12 సంవత్సరాల్లో దేశ ఆర్థికవ్యవస్థ పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు. భారతదేశ పురోగతికి ప్రపంచం సాక్షిగా నిలుస్తున్నదన్నారు. పాత ప్రభుత్వాల విధానాలు భారతదేశ వృద్ధిని అణచివేశాయని,,కాలం చెల్లిన విధానాలు దేశాభివృద్ధిని కుంటుపరిచాయని ఆరోపించారు. గత విధానపరమైన వైఫల్యాలు దేశం వృద్ధిని నిరోధించాయని తెలిపారు.
వ్యాపారులను ప్రోత్సాహించేందుకు,,,:- కార్పొరేట్ సంస్థలను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ,, గడిచిన 12 సంవత్సరాల్లో భారత్లో 50 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని అధిగమించారని వెల్లడించిన ప్రధాని,,ఈ విషయం తాను చెబుతున్నది కాదని, ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొనదని ఆయన తెలిపారు. వ్యాపారులను ప్రోత్సాహించేందుకు కార్పొరేట్ ట్యాక్స్ ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామన్నారు. అదేవిధంగా వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకు ఉన్న వారికి పన్ను మినహాయింపు కల్పించామని పేర్కొన్నారు.

