AP&TGCRIME

మోస్ట్ వాంటెడ్ డ్రగ్ సప్లయర్ మధుసూదన్ రెడ్డి అరెస్ట్!

అమరావతి: మోస్ట్ వాంటెడ్ డ్రగ్ సప్లయర్ “మడ్డి” అలియాస్ మధుసూదన్ రెడ్డిని మాచవరం పోలీసులు బెంగళూరులో సోమవారం అరెస్ట్ చేశారు..బెంగుళూను నుంచి రాష్ట్రంకు తీసుకువస్తున్నట్లు సమాచారం.. మడ్డిని విచారిస్తే పలు కీలక విషయాలు బయటపడుతాయని పోలీసులు భావిస్తున్నారు..మడ్డి స్వస్థలం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె అని పోలీసులు తెలిపారు..మధుసూదన్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల్లో యువతకు డ్రగ్స్ విక్రయిస్తూ బెంగళూరులో మడ్డిగా చలామణి అవుతున్నారు.. బెంగళూరులో డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని యువతకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు..సెప్టెంబరులో బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తో విశాఖపట్నం వెళ్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు శ్రీవాత్సవ్, హవిలు విజయవాడలో పట్టుబడ్డారు..వీరి అరెస్టుతో మధుసూదన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు..ఇతని కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *