AP&TGEDU&JOBSOTHERS

విడుదలైన మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్‌

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసి వాగ్ధనాలను నిలపెట్టుకుంటు ఆదివారం ఉదయం మెగా డీఎస్సీ(Mega DSC – 2025) నోటిఫికేషన్ విడుదల చేసింది.. పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన నోటిఫీకేషన్ లో మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలు ఇచ్చారు..విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ శనివారం మెగా డీఎస్సీ షెడ్యూల్‌ను ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించారు.. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు తెలిపారు..అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అన్ని వివరాలు cse.ap.gov.in, apdsc.apcfss.in లో పొందుపరిచామని చెప్పారు.

మెగా డీఎస్సీకి సంబంధించిన షెడ్యూల్‌ వివరాలు:-

ఏప్రిల్‌ 20 నుంచి మే 15 వరకు: ఆన్‌లైన్‌ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ
మే 20 నుంచి: నమూనా పరీక్షలు
మే 30 నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌
జూన్‌ 6 నుంచి జూలై 6 వరకు: పరీక్షలు

పరీక్షలు పూర్తయిన తరువాత 2వ రోజు ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు..అటు తరువాత ఏడు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు..అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది ‘కీ’ విడుదల చేస్తారు..వారం రోజులకు మెరిట్‌ జాబితా ప్రకటిస్తారు..

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *