AP&TGNATIONALOTHERSSPORTS

జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన భారత షట్లర్ పీవీ సింధు

అమరావతి: జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా‌ పీవీ సింధు చరిత్ర సృష్టించింది.మహిళల సింగిల్స్ ఫైనల్‌లో జపాన్ స్టార్ ప్లేయర్ యమగుచిని వరుసగా గేమ్‌ల్లో ఓడించి ఈ టైటిల్‌ను కైవసం చేసుకుంది.హోరాహోరీగా సాగిన ఈ పోరులో 21-17, 21-17 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే పీవీ సింధు, క్రాస్‌కోర్ట్ డ్రాప్స్, శక్తివంతమైన స్మాష్‌తో యమగుచిపై ఒత్తిడి పెంచింది. తొలి గేమ్‌లో చివరి వరకు హోరాహోరీ పోరు సాగినా, కీలక సమయాల్లో వరుస పాయింట్లు సాధించిన సింధు 21-17తో గేమ్‌ను సొంతం చేసుకుంది. మొదటి గేమ్‌ను గెలవడంతో రెట్టించిన ఉత్సహంతో రెండో గేమ్‌లోనూ సింధు మరింత దూకుడు పెంచింది. యమగుచి ఆడిన నెట్ గేమ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ, 21-17తో రెండో గేమ్‌ను ముగించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *