BUSINESSNATIONALOTHERS

ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్-అయోగ్ సీఈఓ

అమరావతి: భారతదేశం, జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతీ అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం వెల్లడించారు..నీతీ అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ 10వ సమావేశం అనంతరం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్న సందర్బంలో భారత ఆర్థిక పురోగతిపై పలు ఆసక్తికర విషయాలు తెలిపారు..ప్రస్తుత భౌగోళిక రాజకీయ,,ఆర్థిక పరిస్థితులు భారతదేశంకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు..‘‘ప్రస్తుతం మనదేశం 4 ట్రిలియన్ డాలర్ల విలువైన 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ’’ అని వెల్లడించారు..IMF DATA ప్రకారం,, భారత ఆర్థిక వ్యవస్థ జపాన్‌ కంటే పెద్దదని అన్నారు..‘‘అమెరికా,,చైనా,,జర్మనీ దేశాలే ప్రస్తుతం భారతదేశం కంటే ముందంజలో ఉన్నాయని,, ప్రస్తుత ప్రణాళికలకు అనుగుణంగా మనం ముందుకు సాగితే రాబోయే 3 సంవత్సరాల్లో భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది’’ అని తెలిపారు.. భారత్‌లో ఐఫోన్‌ల తయారీపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేయడంపై కూడా నీతీ అయోగ్ సీఈఓ స్పందించారు. సుంకాలపై ఇంకా అస్పష్టత కొనసాగుతోందని,, అయితే  ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం భారతదేశంలో తయారయ్యే ఫోన్లే చవకగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు..రెండో దశ అసెట్ మానెటైజేషన్‌ను కూడా సిద్ధం చేస్తున్నామని త్వరలో దాని వివరాలు వెల్లడిస్తామని అన్నారు..

Nation First

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *